
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) చిత్రాన్ని 'సరిగమ సినిమాస్', రఫ్తార్ క్రియేషన్స్ సంయుక్తంగా అమెరికాలో విడుదల చేయబోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పంపిణీ హక్కులను పెన్ స్టూడియోస్ దక్కించుకుంటే, తమిళ థియేట్రికల్ రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీసుకుంది. ఈ భారీ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆలియా భట్, అజరు దేవగన్, ఓవిలియా మోరీస్, శ్రియ శరణ్ సహా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదలవ్వబోతోంది. అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగా అక్టోబర్ 12నే ప్రీమియర్ షో వేయనున్నట్లు నిర్మాణ సంస్థలు వెల్లడించాయి.