Feb 04,2021 00:02

పాఠ్య పుస్తకాలను పాఠశాల ఉపాధ్యాయులకు అందజేస్తున్న ఎంఇఒ

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: దేశంలోనే అత్యంత వెనకబడిన కోసిగిలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేస్తామని ఎంఇఒ వై.సునంద తెలిపారు. బుధవారం మండల వనరుల కేంద్రంలో రెండో విడత పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పని చేయాలని తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధి తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మించే బాధ్యత ఉపాధ్యాయులేనని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారికైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్‌పిలు హుస్సేని, యోహాన్‌, కార్యాలయ సిబ్బంది వీరారెడ్డి, నరేంద్ర, వీరాస్వామి పాల్గొన్నారు.