Feb 09,2021 10:34

అమరావతిబ్యూరో: హోంమంత్రి సొంత నియోజకవర్గంలో పోలీసులు అక్రమ నిర్బంధాలు చేయడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో సర్పంచ్‌గా పోటీచేస్తున్న అభ్యర్థి భర్త సునీల్‌ కుమార్‌, టిడిపి మండల అధ్యక్షుడిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇటువంటి అప్రజాస్వామిక విధానాలకు దిగుతున్నారు. తక్షణమే టిడిపి నేతలను విడిచిపెట్టి.. ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.