Oct 28,2021 20:48

బాధితురాలితో మాట్లాడుతున్న తహశీల్దార్‌

బాధితురాలితో మాట్లాడుతున్న తహశీల్దార్‌
అక్రమ మద్యం కేసులో జరిమానా
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాళెం:అక్రమ మద్యం కేసులో సత్‌ ప్రవర్తనను ఉల్లంఘించిన మహిళకు గురువారం తహశీల్దార్‌ లక్ష రూపాయల జరిమానా విధించారు.ఏస్‌ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు..బుచ్చిరెడ్డిపాలెం చెందిన అన్నం లక్ష్మీకాంతమ్మ ఈ ఏడాది ఏప్రిల్‌ నెల పదో తేదీన అక్రమ మద్యం అమ్మడాన్ని పోలీసులు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు.ఆ మేరకు ఆమెను తహశీల్దార్‌ హమీద్‌( మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌) ముందు హాజరుపరిచారు. తహశీల్దార్‌ ఆమెలో సత్ప్రవర్తన కోసం లక్ష రూపాయలు జామీను హామీ తీసుకొని విడిచి పెట్టారు. ఈనెల పదో తేదీన ఎస్‌ఈబి పోలీసులు లక్ష్మీకాంతమ్మ ఇంటిపై మరోసారి దాడులు నిర్వహించి 66 పొరుగు,అంతరాష్ట్ర మద్యం సీసాలను గుర్తించారు.
దీంతో ఆమెపై కేసు నమోదు చేసి తహశీల్దార్‌ హమీద్‌ ముందు హాజరు పరిచారు. సత్‌ ప్రవర్తన కోసం లక్ష్మీకాంతమ్మ గతంలో ఇచ్చిన పూచికత్తు హామీని ఉల్లంఘించి మళ్లీ నేరానికి పాల్పడడంతో ఆమెకు లక్ష రూపాయలు జరిమానా విధించారు.