Jan 21,2021 21:22

ప్రొద్దుటూరులో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ : జాతీయ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పోలిట్‌ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ గురువారం ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని గాంధి మహాత్ముని విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ నేతలను అక్రమ అరెస్టు చేయడం దారుణ మన్నారు. రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వసంపై నిరసన తెలియజేసిన టిడిపి నేతలపైనే అక్రమ కేసులు బనాయించడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో కడప పార్ల మెంట్‌ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, రామాంజనేయులు, మాజీ కౌన్సి లర్‌ అమీర్‌బాష, శ్రీనువాసులు, ఖాదరబాద్‌ నాగ మునిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, నంద మూరి అభిమానులు పాల్గొన్నారు. వల్లూరు :టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా, కళావెంకట్రావు అక్రమ అరెస్టులను అరికట్టాలని మండల టిడిపి కన్వీనర్‌ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని టిడిపి కార్యకర్తలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ వైసిపి టిడిపి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వీటిని టిడిపి నాయకులు, కార్యకర్తలు సహించరని పేర్కొన్నారు. కార్యక్రమం లో టిడిపి కార్యకర్తలు మధుసూదన్‌రెడ్డి, రసూల్‌, మహేష్‌, బాష, రఘురామకృష్ణ, విశ్వనాధ్‌, చిట్టి బాబు, సురేష్‌, రాజేష్‌, శ్రీకాంత్‌భార్గవ్‌, నాగరాజ్‌ పాల్గొన్నారు.