Nov 29,2020 23:43

పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులు

ప్రజాశక్తి - పెదకాకాని : ఆకాశంలో చక్కర్లు కొడితే రైతుల బాధలు తెలియవని, వారి మధ్యకు వచ్చి ఆవేదన వినాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నా రు. తుపాను కారణంగా పెదకాకాని మండల ంలో దెబ్బతిన్న పొలాను ఆయన ఆదివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలను కనుక్కున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పంటలకు బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. నష్టం ఎంత వాటిల్లిందనేది ప్రభుత్వం ఇంకా అంచనా వేయకపోవడం సరికాదన్నారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని, ధరల స్థిరీకరణ నిధిని వెంటనే విడుదల చేయాలని కోరారు. పరిశీల నలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వ రరావు, టి.శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.