Jun 10,2021 21:23

హైదరాబాద్‌ : వినూత్నమైన కూలింగ్‌ పరిష్కారాలను అందించే ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ తాజాగా 4700 మెట్రిక్‌ టన్నుల బటర్‌ కోల్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు తెలిపింది. ఈ అమ్మోనియా రిఫ్రిజిరేషన్‌ ప్రాజెక్ట్‌ రూపకల్పన, ఇంజినీరింగ్‌, తయారీ, సరఫరా, అమరిక, పరీక్ష, నిర్వహించడం ప్రాతిపదికన యూనియన్‌ ఆఫ్‌ గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (అముల్‌)లో సభ్య సంస్థ పంచ్‌మహల్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ లిమిటెడ్‌ నుంచి అందుకున్నట్లు పేర్కొంది. ఇప్పుడు డెయిరీ ప్లాంట్‌ కోల్డ్‌ స్టోరేజీతో పాటుగా ఐస్‌క్రీమ్‌ మిక్స్‌ ప్లాంట్‌ సొల్యూషన్స్‌ సైతం అందిస్తున్నట్లు పేర్కొంది.