
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే ఎన్నికయ్యాడు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాపై 11-5 ఓట్ల తేడాతో గెలిచి స్వతంత్ర చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. జులైలో శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియడంతో తాత్కాలిక చైర్మన్‌గా ఖవాజా ఉన్న సంగతి తెలిసిందే. బార్క్లే న్యాయవాదిగా పనిచేశారు. 2012లో న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా, 2015లో ప్రపంచకప్ డైరెక్టర్‌గా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని కొన్ని బోర్డులకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. బార్క్లే మాట్లాడుతూ.. ఐసిసి చైర్మన్‌గా ఎన్నికవడం గర్వంగా ఉందన్నారు. మద్దతు తెలిపిన ఐసిసి డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్‌ను మరింత బలోపేతం చేసి వాణిజ్య పరంగానూ ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని అన్నారు.