Jun 11,2021 16:24

మిడుతూరు :

ఐసిడిఎస్ ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె భాస్కర్ రెడ్డి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ నాయకురాలు ఎం ఉమాదేవి డిమాండ్ చేశారు. శుక్రవారం అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం ఉమాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కె భాస్కర్ రెడ్డి సిఐటియు మండల నాయకురాలు జి నాగమణి మాట్లాడుతూ ఐసిడిఎస్ లక్ష్యానికి విడ్డూరంగా రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం దారుణమన్నారు. అంగన్వాడీ సెంటర్లలో ఉన్నది మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు మెదడు మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటపాటల ద్వారా వారికి వికాసాన్ని అభివృద్ధి చేస్తూన్నారన్నారు. గర్భిణీలకు బాలింతలకు అనేక సేవలు చేస్తున్నారు. ఐ సి డి ఎస్ కు విడ్డూరంగా ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయడం వల్ల అంగన్వాడి వర్కర్లకు వెల్ఫేర్ మినీ వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతారు అంగన్వాడి సెంటర్లు దూరం అవుతాయి అన్నారు.  కరోనాతో చనిపోయిన వారికి 50 లక్షల భీమా సౌకర్యం వర్తింపజేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కనీస వేతనం పెన్షన తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూపర్వైజర్ పోస్టులు 50 సంవత్సరాలు వయోపరిమితి పెంచాలన్నారు, కరోణ వారియర్స్ పనిచేసిన కార్మికులు మరణించిన కుటుంబాలకు 50 లక్షలు రూపాయలతో పాటు కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం తగ్గించాలని ప్రజలకు మేలు కొలిపే చర్యలను చేపట్టాలని ప్రజలకు నష్టం కలిగించే ఆలోచనలు చర్యలను తక్షణం నిలిపివేయాలని కోరుతూ అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మిడ్తూర్ మండల అధికారి ఎమ్మార్వో గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ శకుంతల, రాధిక, మంగమ్మ, సురేఖ, వీఆర్ఏల యూనియన్ కొండలు, వెంకటేశ్వర్లు, పారిశుద్ధ కార్మికులు సుగుణమ్మ, సుజాత, తదితర కార్మికులు అంగన్వాడీలు పాల్గొన్నారు.