Oct 27,2021 20:37

ముంబయి :  ప్రయివేటు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్‌ కొత్తగా ''బీఫిట్‌'' అనే ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈప్లాన్‌లో వినియోగదారులకు అన్ని రకాల ఒపిడి సేవలను నగదు లేకుండానే బీఫిట్‌ అందిస్తుందని తెలిపింది. దీని సేవలను ఐఎల్టేక్‌ కేర్‌ యాప్‌ ద్వారా పొందవచ్చని పేర్కొంది. డాక్టర్‌ కన్సల్టేషన్‌, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్‌ సర్వీసులు, ఫిజియోథెరపీ సెషన్‌లను నగదు లేకుండానే పొందవచ్చని తెలిపింది.