Oct 14,2021 20:30

ధోనీ × నరైన్‌
రా.7.30 గం||ల నుంచి

దుబాయ్: ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌ా14 ఫైనల్‌ శుక్రవారం దుబారు వేదికగా జరగనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగనున్నాయి. ఈ సీజన్‌ ఐపిఎల్‌ తొలిసెషన్‌ మ్యాచ్‌లు భారత్‌ వేదికగా ఏప్రిల్‌ 9న ముంబయిాబెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమయ్యాయి. మే 2న పంజాబ్‌ కింగ్స్‌ాఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన 29వ మ్యాచ్‌ అనంతరం కరోనాతో అర్ధాంతరంగా వాయిదా పడింది. తిరిగి యుఏఇ వేదికగా సెప్టెంబర్‌ 19న చెన్నైాముంబయి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమై.. అక్టోబర్‌ 15న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది. ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌ లీగ్‌ దశలో, క్వాలిఫయింగ్‌ా1లో అద్భుత ప్రదర్శన కనబర్చగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సంచలన విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇరుజట్లలోనూ ఆల్‌రౌండ్‌ ప్రతిభగల ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో ఈ ఫైనల్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై జట్టు ఐదుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి 2010, 2011, 2018లో టైటిళ్లను గెలిచింది. మరో ఐదుసార్లు ఫైనల్లో ఓడి రన్నరప్‌ ట్రోఫీలకే పరిమితమైంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2012, 2014 సీజన్‌లలో ఫైనల్‌కు చేరి రెండుసార్లూ టైటిళ్లను ముద్దాడింది. ఇక 2012 ఫైనల్లో చెన్నై నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలోని కోల్‌కతా మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి తొలిసారి ఐపిఎల్‌ టైటిల్‌ను కొట్టింది.