May 04,2021 15:06

న్యూఢిలీ : దేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరుగుతూ.. అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌ 2021-)కు తగిలింది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్‌ బారిన పడటంతో ఐపిఎల్‌ 2021 సీజన్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం ప్రకటించారు. కాగా ఇప్పటివకే వేర్వేరు జట్లలో ఉన్న 9 మంది ఆటగాళ్లు కోవిడ్‌ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఐపిఎల్‌ను రద్దు చేయడమే మంచిదని భావించి బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఐపిఎల్‌ వాయిదా పడటంతో క్రికెట్‌ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.