Nov 29,2021 14:44

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎయిడెడ్ పోరాటం ప్రభుత్వం మెడలు వచ్చిందని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ అన్నారు. అదే పోరాట స్ఫూర్తి భవిష్యత్ లో కొనసాగలన్నారు. రెండో రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మనం కోరుకున్న, శాస్త్రీయ విద్యను నేడు ప్రభుత్వాలు అందించడం లేదు. 30 శాతం మంది దారిద్ర రేఖ కింద ఉన్నారు. వ్యవసాయ పెట్టిబడి భరించలేని పరిస్థితి, మా పిల్లల్ని చదివించుంకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నిస్తే భరించలేని పాలకులు నేడు అధికారంలో ఉన్నారు. ప్రజలు ఆస్తులను మోనటైజేషన్ పేరుతో అమ్మేయలని చూస్తుంది. దీని వలన సామాజిక న్యాయం అమలుకు తిలోదకాలు ఏర్పడతాయి. నేడు దేశంలో రైతులు పోరాటం ప్రపంచాన్ని ఆకర్షించిందన్నారు. మోడీ ఏడున్నర కాలంలో వ్యవసాయం కుంటు పడింది. కార్పొరేట్ అనుకూలంగా చట్టాలు చేశారు. 62 లక్షల కోట్లు ఆదాయం వచ్చే వ్యవసాయంపై కార్పొరేట్లు కళ్ళు పడ్డాయన్నారు. రైతులు పోరాటంలో విద్యార్థులు, కార్మికులు, మహిళలు కలిసి ఐక్యంగా పోరాడి మోడీ మెడలు వంచారన్నారు. మహాసబాల్లో ఐక్య పోరాటాలు కార్యాచరణ రూపొందీంచాలని కోరారు. సంపదను సృస్టించడంలో పాత్ర లేని వారు నేడు దేశంలో శాసిస్తున్నారు. ప్రగతి శీల భావాలు కలిగిన మనం అందరం కలిసి గట్టుగా ఉద్యమిద్దమని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్రా మాల్యాద్రి పాల్గొని మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో బలహీన వర్గాలు విద్యకు దూరమైయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ పోరాటానికి కెవిపిఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలిపారు. తాను కూడా విద్యార్ధి దశ నుండి వచ్చానని పేర్కొన్నారు.

ఐక్యంగా పోరాడి.. ప్రభుత్వ రంగాలను కాపాడుకుందాం : ఎస్ఎఫ్ఐ మహాసభలో వక్తలు