Apr 11,2021 15:30

అనంతపురం: సాంకేతిక విద్యలో విశిష్ట సేవలందించిన అధ్యాపకులుకు ఐఎస్‌టిఇ 2019- 2020 సంవత్సరాలకు గానూ ఆదివారం అవార్డులు ప్రకటించింది. అనంతపురం జెఎన్టీయూ ఆచార్యులు ఎనిమిది మందికి ఈ అవార్డులు లభించాయి. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఎపి స్టేట్‌ విభాగం ప్రతి ఏడాది సాంకేతిక విద్యలో విశేష సేవలు అందించిన ఆచార్యులకు వివిధ విద్యాసంస్థల సహకారంతో అవార్డులు అందిస్తుంది. అందులో భాగంగా ఆదివారం 2019, 2020 సంవత్సరములో విశేష సేవలు అందించి అవార్డులకు ఎంపికైన ఆచార్యుల వివరాలను ఐఎస్‌టిఇ ప్రకటించింది. అందులో అనంతపురం జెఎన్‌టియు అధ్యాపకులు 2020 సంవత్సరానికి గానూ ఉత్తమ సాంకేతిక విద్యా ఎడ్యుకేటర్‌ కింద మాజీ జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య లాల్‌ కిషోర్‌కు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డు ప్రకటించింది. ఉత్తమ సివిల్‌ ఇంజనీరింగ్‌ ఆచార్యులు అవార్డుకు అనంతపురం జె.ఎన్‌. టి.యు సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యులు డాక్టర్‌ సి..శిశిధర్‌ ను ఎంపిక చేశారు. అదే విధంగా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఉత్తమ మహిళా ఆచార్యులు పి.సుజాత, ఉత్తమ పరిశోధనాభివఅద్ధి ఆచార్యులు అవార్డుకు కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం నుంచి ఎస్‌.వి సత్యనారాయణ ఎంపిక అయ్యారు. అదే విధంగా 2019 సంవత్సరానికి ఉత్తమ ఇంజనీరింగ్‌ ఆచార్యులు అవార్డుకు అనంతపురం జేఎన్టీయూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యఎం.ఎల్‌.ఎస్‌.దేవకుమార్‌, ఉత్తమ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఆచార్యులు అవార్డుకు వి.శంకర్‌, ఉత్తమ ఇంజనీరింగ్‌ మహిళా ఆచార్యులు అవార్డుకు జి.మమత, ఉత్తమ పరిశోధన సహాయక ఆచార్యులు అవార్డుకు సి.శోభా భిందు ఎంపికయ్యారు. వీరు అవార్డు అందుకునే వివరాలు త్వరలో చెబుతారు.