May 18,2021 22:06

: ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆళ్లగడ్డ: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు, కర్ఫ్యూ విధులలో ఉన్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు యాదవ సంఘం నాయకులు మల్లికార్జున రావు ఆధ్వర్యంలో చికెన్‌ బిర్యాని పొట్లాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున రావు మాట్లాడుతూ మన రక్షణ కోసం కరోనాతో పోరాడుతున్న పోలీసులకు, అలాగే పేదలకు, స్ఫూర్తి మదర్‌ హౌమ్‌ లో ఉన్న చిన్నారులకు తమవంతుగా చికెన్‌ బిర్యానితో పాటు శాఖాహారులకు టమోటా కర్రీతో ఆహార పొట్లాలను అందజేశా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కర్ఫ్యూ నిబంధనలను అందరూ పాటించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్‌ఐ రామాంజనేయులు మల్లికార్జున రావుతో పాటు యాదవ సంఘం వారిని అభినందించారు. కార్యక్రమంలో ఉపేంద్ర, రాజేష్‌, ఐజాక్‌, ఇంతియాజ్‌ తదితరులు ఉన్నారు.