Oct 28,2021 20:28

ఆహా ప్లాట్‌ ఫామ్‌లో తాజాగా ఓ కొత్త వెబ్‌ సీరిస్‌ మొదలు కాబోతోంది. అభిజీత్‌ పూండ్ల, ధన్య బాలకృష్ణ, వై. కాశీ విశ్వనాథ్‌, సుధ, షాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషిస్తున్న 'అల్లుడుగారు' వెబ్‌ సీరిస్‌ను జయంత్‌ గాలి డైరెక్ట్‌ చేశారు. తమడ మీడియా దీనిని నిర్మించింది. మోడ్రన్‌ డే రిలేషన్‌షిప్స్‌, అందులో ఉన్న కాంప్లికేషన్స్‌ గురించి పర్ఫెక్ట్‌గా ఫోకస్‌ చేసి తీసిన ఈ వెబ్‌ సీరిస్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ అక్టోబర్‌ 29న స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... కథ మొత్తం కొత్తగా పెళ్లైన జంట అజరు, అమూల్య చుట్టూ తిరుగుతుంది. సాంప్రదాయక కుటుంబంలో తన అత్తమామలు నళిని, అశోక్‌తో ఉండవలసి వచ్చిన అజరు పరిస్థితిని సరదాగా తెరకెక్కించామన్నారు.