Apr 15,2021 01:03

తగరపువలసలో జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు

సబ్బవరం : మండల కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదీప్‌ రాజ్‌ పాల్గొన్నారు. అగ్నిమాపక శకటాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి ఎస్‌.దిలీప్‌ కుమార్‌, ఎవి.రమణ, వైసిపి నాయకులు తుంపాల అప్పారావు, కోటాన రాము, ఎస్‌.నారాయణ మూర్తి, ఎస్‌.భూషణం పాల్గొన్నారు. తగరపువలస : చిట్టివలస అగ్నిమాపక కేంద్రంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ముందుగా అగ్నిమాపక శాఖాధికారి షేక్‌ మదీనా, సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు.