Jan 26,2021 00:50

ప్రజాశక్తి - డుంబ్రిగుడ
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బి రోడ్డు, పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం మీదుగా సర్వేకు సోమవారం వచ్చిన అధికారులను గిరిజన సంఘం ఆధ్వర్యాన స్థానిక వర్తక సంఘం నాయకులు, గిరిజనులు అడ్డుకున్నారు.రోడ్డు డిజైన్‌ మార్పు చేసి బైపాస్‌ హైవే నిర్మించాలని గ్రామస్తులు, వర్తక సంఘం నాయకులు సంబంధిత అధికారులను చెప్పారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోతురాజు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న డిజైన్‌ మాదిరిగా రోడ్డు నిర్మిస్తే పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం సగానికిపైగా ప్రకతి అందాలు కనుమరుగు అవుతాయన్నారు. మండల కేంద్రంలో షాపులు నిర్మించి బతుకుతున్న గిరిజనుల వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటాయని, దీంతో ఆర్థికంగా నష్ట పోతారని చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా ఆనుకొని ఉన్న నివాస గహాలు కూడా కోల్పోవాల్సి ఉంటుందని, తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు డిజైన్‌ మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు భాస్కర్‌ రావు, స్వామి, సుబ్బారావు, వైసిపి నాయకులు శ్రీరాములు, బాలకష్ణ పాల్గొన్నారు.