Nov 25,2020 08:29

వాషింగ్టన్‌ : కింద పడ్డా నాదే పై చేయి అన్న చందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అంగీకరించేందుకు నిరాకరిస్తూ, తొలుత అధికార మార్పిడి అడ్డుతలిగారు. అయితే తాజాగా ఆయన కాస్తా మెత్తబడినట్లు కనిపిస్తుంది. అధికార మార్పిడికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే తాను ఓటమి చెందాననడాన్ని అంగీకరించడం లేదు. కాగా అధికార మార్పిడికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ట్రంప్‌ తన అధికారులకు ఆదేశాలిచ్చారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు జిఎస్‌ఎ అడ్మినిస్ట్రేటర్‌ మర్ఫీ లేఖ రాసిన అనంతరము ఆయన ఈ ఆదేశాలు ఇవ్వటం గమనార్హం. అదేవిధంగా ఫలితాలపై తీర్పులు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా రావడంతో అధికార మార్పిడికి అంగీకరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ...ఆరంభ లాంఛనాల కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేయాలని మర్ఫీ బృందానికి సిఫార్సు చేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో బైడెన్‌ నూతన మంత్రి వర్గ ఏర్పాట్లకు చకచకా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.