Jul 30,2021 21:11

ప్రజాశక్తి - ఎ.కొండూరు : కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఎం.కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫీజులవాత, విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు తరుణ్‌, గోపీనాయక్‌ పాల్గొన్నారు. ఎడ్యుకేషన్‌ : కార్పొరేట్‌ విద్యా సంస్థల అధిక ఫీజులు దోపిడీని అరికట్టాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని తహశీల్దారు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు ఓ.యేసుబాబు మాట్లాడుతూ కొన్ని విద్యా సంస్థలు గత ఏడాది కన్నా అధికంగా ఫీజులు పెంచి ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో భారీ స్థాయిలో వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షులు నరేంద్ర, రాధాకృష్ణ, నగర సహాయ కార్యదర్శిలు ప్రసాద్‌, అభిషేక్‌ పాల్గొన్నారు.