
కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు కార్పొరేషన్‌లోని 18వ వార్డు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి మారెళ్ళ రామాంజనేయులు తెలిపారు. 18వ వార్డు పరిధిలోని మాల వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిపిఎం జిల్లా నాయకులు జి.రామకృష్ణ మాట్లాడుతూ... సిపిఎం సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కర్నూలు నగరంలోని జొహరాపురంలో గల 18వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఇది వరకే తమ పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కార్పొరేటర్‌గా అవకాశం కల్పిస్తే ఈ సమస్యలను పరిష్కరించేందుకు దష్టి సారిస్తానని హామీనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వివరించారు. విధానాల వలన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయన్నారు. వైసిపి,టిడిపి బిజెపి పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. ఆవాజ్ ఆధ్వర్యంలో సిపిఎం అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్ ఆర్సి, సిఎఎ ఇలాంటి బిల్లులను ఆమోదించిన టువంటి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆవాజ్ జిల్లానాయకులు ఇక్బాల్ హుస్సేన్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆవాజ్ నాయకులు అబ్దుల్ దేశారు సిపిఎం నాయకులు మహమూద్, మునిస్వామి, బడు నూర్‌వలి, బతకన్న, రవి, రాము, ఐద్వా నాయకురాలు ఖంరున్బి, అమీనా, మాలన్బి పాల్గొన్నారు.