Mar 02,2021 22:55

ప్రచారం చేస్తున్న గౌస్‌ దేశారు , తదితరులు

- 2వ వార్డు అభ్యర్థి ఎస్‌ఎమ్‌డి.షరీఫ్‌
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌: 
తనను ఆదరించి, గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని రెండో వార్డు సిపిఎం కార్పొరేటర్‌ అభ్యర్థి ఎస్‌ఎమ్‌డి.షరీఫ్‌ కోరారు. మంగళవారం చౌక్‌బజార్‌, అమ్మవారిశాల మొదటి, రెండో ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.గౌస్‌దేశారు మాట్లాడారు. ప్రజలు ఓటును నోటుకు అమ్ముకోకుండా వార్డు అభివద్ధి కోసం పని చేసే అభ్యర్థికి వేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడేది సిపిఎం మాట్రమే నన్నారు. సిపిఎం అభ్యర్థి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచార సందర్భంగా మహిళల వ్యక్తిగత మరుగుదొడ్లు, మురుగు నీరు శుభ్రం చేయించటం, దోమలు, పందులు, కుక్కలు సమస్యల నుండి విముక్తి చేయడానికి మంచి అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. నగర నాయకులు రాజగోపాల్‌, ఖాజభాష , పార్వతయ్య, షేక్షావలి బీసన్న, సుంకన్న, కిషోర్‌, రామకష్ణ, శ్రీనివాసులు శేఖర్‌ పాల్గొన్నారు.