Nov 25,2021 21:17

ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ జూ.హాకీ టోర్నీ
భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌ గ్రూప్‌ాబి రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. గురువారం జరిగిన పోటీలో భారత్‌ 5-1 గోల్స్‌ తేడాతో కెనడాను చిత్తుచేసింది. తొలి మ్యాచ్‌లో పటిష్ట ఫ్రాన్స్‌ చేతిలో 5-4 గోల్స్‌ తేడాతో ఓటమితో తేరుకున్న కుర్రాళ్లు నేటి మ్యాచ్‌లో సత్తా చాటారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే భారత్‌ 3-0 గోల్స్‌ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఉత్తమ్‌ సింగ్‌ 6వ ని.లో, కెప్టెన్‌ వివేక్‌ సాగర్‌ 8వ ని.లో ఒక్కో గోల్‌ కొట్టడంతో తొలి క్వార్టర్‌లోనే భారత్‌ 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో క్వార్టర్‌ 17వ ని.లో సంజరు పెనాల్టీ స్టోక్‌ను, 27వ ని.లో సింగ్‌ మణిందర్‌ ఫీల్డ్‌ గోల్‌ చేశాడు. ఆ తర్వాత కెనడా తరఫున క్రిస్టోఫర్‌ 30వ ని.లో ఓ ఫీల్డ్‌ గోల్‌ కొట్టడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 4-1 గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. మరో పోటీలో ఫ్రాన్స్‌ జట్టు 7-1 గోల్స్‌ తేడాతో పోలెండ్‌ను చిత్తుచేసింది. ఇక గ్రూప్‌ాసిలో స్పెయిన్‌ జట్టు 17-0 గోల్స్‌ తేడాతో అమెరికాను ఓడించింది. ఆ జట్టులో సిమో హ్యాట్రిక్‌ గోల్స్‌తో పాటు క్లాప్స్‌ 4గోల్స్‌తో సత్తాచాటారు. మరో పోటీలో నెదర్లాండ్స్‌ జట్టు 12ా5 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాను చిత్తుచేసింది. ఇక గ్రూప్‌ాడిలో అర్జెంటీనా జట్టు 14-0 గోల్స్‌ భారీ తేడాతో ఈజిప్ట్‌ను చిత్తుచేశాయి.