Dec 03,2021 19:35

టాలీవుడ్‌లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో హీరో అడివి శేష్‌ ఒకరు. క్షణం, గూఢాచారి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్‌ అయిన శేష్‌ తన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందని వెల్లడించారు. ''నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. త్వరలోనే ఈ సినిమాలను ప్రకటిస్తాను'' అన్నారు. ప్రస్తుతం శేష్‌, శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో 'మేజర్‌' చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి తర్వాత మలయాళంలోకి డబ్‌ చేస్తున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.