Mar 02,2021 23:31

సదస్సుకు హాజరైన విద్యార్థులు

ప్రజాశక్తి - గండేపల్లి 'మండలంలోని సూరంపాలెం ఆదిత్య గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్లో స్టాక్‌ మార్కెట్‌పై వర్చువల్‌ మోడ్‌లో అవగాహనా సదస్సు నిర్వహించినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సుగుణారెడ్డి తెలిపారు.' ఈకార్యక్రమంలో షైన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ నిర్వాహకులు శ్రీహర్ష ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల్లో అవగాహనా కల్పించినట్లు ఆమె తెలిపారు. ఈసందర్భంగా శ్రీహర్ష ఆన్‌ లైన్‌ ద్వారా సదస్సులో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ముందువరుసలో ఉందన్నారు. అలాగే దేశంలోని పెట్టుబడిదారులు అత్యధికులు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారని, తద్వారా వారు మెరుగైన లాభాలను పొందుతున్నారని తెలిపారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే విధానం స్టాక్‌ మార్కెట్‌పై విద్యార్థులకు క్షుణ్ణంగా ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ద్వారా వివరించారు. మనదేశ స్టాక్‌ మార్కెట్‌లో ముఖ్యమైన బిఎస్‌ఇ, (బొంబాయిస్టాక్‌ ఎక్స్చేంజి), ఎన్‌ఎస్‌ఇ, (నేషనల్‌ స్టాక్‌ఎక్స్చేంజి)లో వాటాదారులు వాటాలను కొనుగోలు, అమ్మకం పద్దతులను వివరించారు. విద్యార్థులు స్టాక్‌ మార్కెట్‌లో కొనుగోలు (ఇన్వెస్ట్‌), అమ్మకం ద్వారా లాభాలు (రిటర్న్స్‌) ఆర్జించడం ఎలా అనే విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డాక్టర్‌ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో జరిగే ఇతర విజ్ఞానదాయకమైన వ్యాపారాత్మక అభివృద్ధిపైనా ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. అందుకే ఆదిత్య విద్యార్థి సర్వతో ముఖాభివృద్దికి ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజ్ఞాదాయకంగా జరిగిన ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.ఆస్ధాశర్మ, డాక్టర్‌ ఎన్‌.విశాలాక్షి, ఉపాధ్యాయ సిబ్బంది, బిబిఎ, ఎంబిఎ విద్యార్థులు పాల్గొన్నారు.