Oct 14,2021 18:21

కృష్ణా : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. జిల్లాలోని కైకలూరు మండలం వరాహపట్నంలో చిన్నారులు ఆడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన వారు అందరూ 10 ఏళ్ల లోపు వారే. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.