Jan 15,2022 17:17

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఇప్పటికే పలు అనేక సినిమాలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4న విడుదల కానున్న ఆచార్య సినిమాను కూడా అదే కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన సిద్ధా ట్రీజర్ అందరిని మెప్పించింది.