May 03,2021 19:58

మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య' లాక్‌డౌన్‌ వలన వాయిదా పడుతూ వస్తుంది. మూడేళ్లుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్న కొరటాల శివ ఈ సినిమాని ఈ సంవత్సరం పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. చిత్రానికి సంబంధించి ఇంకా 15 రోజుల షూటింగ్‌ మిగిలి ఉందని, ఈ పార్ట్‌ని జూన్‌ లోనే పూర్తి చేయాలనుకుంటున్నాడు. దానికి సంబంధించి రామ్‌ చరణ్‌, హీరోయిన్స్‌ కాజల్‌, పూజాహెగ్డె షూటింగ్‌లో పాల్గనాల్సి ఉంది. ఈ నెలలో ఎలాగైనా షూటింగ్‌ పూర్తి చేసి ఆగస్టులో విడుదలకు సిద్ధం చేయాలని పట్టుదలతో ఉన్నాడు.