Dec 24,2020 22:00

సలహా మండలి అధ్యక్షులు బాధ్యతలు స్వీకరిస్తున్న మురళీమోహన్‌రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సలహా మండలితో బాటలు వేద్దామని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీ మోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం కోసిగి స్త్రీ శక్తి భవనంలో వ్యవసాయ అధికారి రాజు అధ్యక్షతన సలహా మండలి అధ్యక్షులుగా మురళీ మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించి, సభ్యులు, రైతులతో మొదటి సమావేశం నిర్వహించారు. మొదటగా మురళీ మోహన్‌ రెడ్డిని ఘనంగా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని సభ్యులు, రైతుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎమైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఎంపిడిఒ బంగారమ్మ, సలహా మండలి ఉపాధ్యక్షులు బెట్టన్నగౌడ్‌, సభ్యులు మల్లికార్జున గౌడ్‌, రమేష్‌, పరశురామ్‌, రామలింగప్ప, ముక్కరప్ప, ఈరన్న, దేవి, వైసిపి మండల నాయకులు నాడిగేని నాగరాజు, జగదీష్‌ స్వామి, షంషుద్దీన్‌, షౌకత్‌, దొడ్డి నర్సన్న, నరసింహులు గౌడ్‌, దుద్ది నాగేష్‌, ఆకాష్‌ రెడ్డి, చింతలయ్య, ముగలదొడ్డి సోమేష్‌ పాల్గొన్నారు.