
వృద్ధుడికి కరోనా టీకా వేస్తున్న వైద్య సిబ్బంది
పూసపాటిరేగ: మండలంలోని పేరాపురానికి చెందిన 92 ఏళ్ల వృద్ధుడైన కెఎస్.ప్రకాశరావుకు స్థానిక పిహెచ్సిలో మంగళవారం కరోనా టీకా వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్వర్మ మాట్లాడుతూ, ఆ వృద్ధుడే స్వయంగా వచ్చి కోవిడ్ టీకా వేసుకుంటానని కోరడంతో రిజిస్ట్రేషన్ చేయించి టీకా వేశామని తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడని తెలిపారు. అనంతరం పూసపాటిరేగ ఎస్ఐ ఆర్.జయంతితో పాటు పోలీసు సిబ్బంది కూడా టీకా వేయించుకున్నారని తెలిపారు. ఈ టీకా సురక్షితమైనదని, అందరూ వేయించుకోవాలని కోరారు.