Feb 12,2021 23:28

నిరసన తెలుపుతున్న కార్మికులు, ఉద్యోగులు

ప్రజాశక్తి - నంద్యాల: సిఐటియు ఆధ్వర్యంలో ఆర్‌ఎఆర్‌ఎస్‌ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన పోరాటం శుక్రవారం నాటికి 90వ రోజుకు చేరుకుంది. సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్‌, కోశాధికారి వెంకటలింగం మాట్లాడుతూ ఆర్‌ఏఆర్‌ఎస్‌ అభివద్ధి కోసం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. 1906 సంవత్సరం నుండి నేటి వరకు అభివద్ధి చెందుతూ ఉందని అటువంటి సంస్థను నాశనం చేయవద్దని ఎంపీ ఎమ్మెల్యేలకు కార్మికులు 90 రోజులుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వైద్య కళాశాలను ఇతర భూముల్లో నిర్మించేందుకు పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నాయకులుఎ.వి.రమణ, ఖాదర్‌ వలి, గోపాల్‌ ,ఎల్లమ్మ, పుల్లయ్య, నాగేశ్వరమ్మ, అయ్యన్న, మైమున్నీసాతోపాటు కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.