
ముంబయి: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మహిళల క్రికెట్ సిరీస్‌తో మార్చి 7నుంచి తిరిగి ప్రారంభం కానుంది. మహిళల క్రికెట్ జట్టు కరోనా అనంతరం ఆడనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఇదే. భారత పర్యటనకు రానున్న సఫారీ జట్టు ఆ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, 3టి20ల్లో తలపడనుంది. దీనికి ముందు సఫారీ మహిళల బృందం మార్చి 6వరకు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అనంతరం 7నుంచి ఐదు వన్డేల సిరీస్, 20నుంచి 3టి20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లక్నో వేదికగా జరగనుంది.