Jun 10,2021 20:58

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని చమురు, గ్యాస్‌ క్షేత్రాలను మరోసారి వేలానికి పెట్టింది. గురువారం 32 ప్రాంతాల్లోని 75 చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్న క్షేత్రాలను వేలానికి పెట్టినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ గుప్తా వెల్లడించారు.  ఇందులో 54 లోతులేని నీటిలోనివి కాగా.. 2 మాత్రం అతి నీటి లోతులోనివి, మరో 19 భూమిపై కలవని తెలిపారు. చమురు దిగుమతిలో ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద దేశంగా ఉంది. ఇంతక్రితం రెండు వేలాల్లో 54 ప్రాంతాల్లోని చమురు, గ్యాస్‌ క్షేత్రాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.