Mar 02,2021 15:12

విజయనగరం టౌన్‌: విశాఖ ఉక్కు కోసం ఈ నెల 5న జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి,యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ నాగభూషణం, టిఎన్‌ఎస్‌ ఎఫ్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి ఎం.భానుప్రకాశ్‌, డివైఎఫ్‌ఐ కన్వీనర్‌ ఏ.మణికంఠలు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే భద్రత కలిగిన ఉపాధి ఉంటుందన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు అయితే ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు గుండె లాంటి స్టీల్‌ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయడాన్ని అన్ని తరగతులు ప్రజలు వ్యతిరేకించాలని వారు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ని రక్షించుకోవడం జరిగే రాష్ట్ర బంద్‌లో విద్యార్థులు, యువజనులు అధిక సంఖ్యలో పాల్గని విజయవంతం చేయాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరీష్‌, హర్ష, రమేష్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు వి.చైతన్యబాబు, తదితరులు పాల్గొన్నారు.