Oct 28,2021 20:32

సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. వి సెల్యూలాయిడ్‌, ఎస్‌.కె.ఎన్‌. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్‌ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. తాజాగా 'మంచి రోజులు వచ్చాయి' చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. యూవీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపుదిద్దుకుంది.