Oct 27,2021 22:54

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో బుధవారం మరో 47 మందికి కరోనా నిర్ధారణవడంతో ఇప్పటి వరకు పాజిటివ్‌ల సంఖ్య 1,79,758కు చేరింది. ఇద్దరు మృతి చెందడంతో కరోనా మరణాలు 1306కు పెరిగాయి. మంగళగిరి, గుంటూరులో ఒక్కొక్కరు మృతి చెందారు. తాజా పాజిటివ్‌లలో గుంటూరు నగరంలో 28 నమోదైనట్లు జిల్లా అధికారులు ప్రకటించగా 21 నమోదైనట్లు కార్పొరేషన్‌ అదికారులు పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా పాజిటివ్‌లు
గుంటూరు రూరల్‌ 1, మంగళగిరి 4, రాజుపాలెం1, తాడేపల్లి 1, వట్టిచెరుకూరు 1, నర్సరావుపేట 4, చెరుకుపల్లి 2, కాకుమాను 2, కొల్లూరు 2, తెనాలి 1, గుంటూరు నగరంలో మాచిరాజువారివీధి 2, పండరీపురం 2, వికాస్‌నగర్‌ 2 కేసులు నమోదరయ్యాయి.