Sep 20,2021 01:02

నిరసన తెలియజేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-కడియం
ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ కడియం యూనిట్లో (ఎం.ఆర్‌.పాలెం) వేతన ఒప్పందంపై మేనేజ్‌మెంట్‌ వైఖరికి నిరసనగా మిల్లు వద్ద కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం 44వ రోజుకు చేరాయి. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు మాట్లాడుతూ మేనేజ్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చర్చలను కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నా ఆలోచన లేకుండా మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తక్షణమే అగ్రిమెంట్‌ చేయాలని లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు మేనేజ్‌మెంట్‌ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బి.శ్రీనివాస్‌, సత్య నారాయణ, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, జి.శ్రీనివాస్‌, డి.ఎస్‌. ఆర్‌.చౌదరి, యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.