Mar 02,2021 21:43

విలేకరుల సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం :మున్సిపల్‌ ఎన్నికల్లో బాగంగా స్థానిక ఎమెల్యే బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తున్నారని, 4 నుండి ప్రచారం ప్రారంభిస్తారని టిడిపి స్థానిక నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసే అభ్యర్థుల వివరాలను బుధవారం ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల తరవున ప్రచారానికి శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ రానున్నారని చెప్పారు. 4 వ తేదీ ఉదయం 9 గంటలకు సూగురు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి 19 వార్డులో ప్రచారం మొదలు పెట్టి సాయంత్రానికి 9 వార్డులు పుర్తి చేస్తారన్నారు. ఈ సమావేశంలో ఆహుడా మాజీ చెర్మెన్‌ అంబికాలక్ష్మినారాయణ, పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శిలు సవితమ్మ, మనోహర్‌ నాయుడు, రొద్దం నరసింహులు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌, పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గోన్నారు.