Oct 28,2021 19:25

matladutunna matti venkateswararao

31న యాత్రను జయప్రదం చేయాలి
ప్రజాశక్తి-కోడూరు
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపు మేరకు గురువారం కోడూరు మండల జనసేన నేతలు స్థానిక ఇండోర్‌ స్టేడియం వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నెల 31న విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఈ సభకు కోడూరు మండలం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చారు జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్‌ షరీఫ్‌, జిల్లా లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, సీనియర్‌ నాయకులు రాయపూడి వేణు గోపాల రావు , సర్పంచులు కనగాల వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి శ్రీ దుర్గ, పార్టీ నేతలు ఉల్లి శేషగిరి మరే గంగయ్య, బడే వెంకటేశ్వరరావు, మేడ పిచ్చయ్య, తొమ్మిదో వార్డ్‌ మెంబర్‌ దామర్ల నారాయణరావు, కోన శ్రీమన్నారాయణ, తోట సోమ శేఖర్‌ రావు ,యర్రంశెట్టి దామోదరరావు,పిట్టలంక ఉపసర్పంచ్‌ బావిశెట్టి ప్రభాకర్‌ రావు, చిట్టిఫ్రొలు మనీష్‌, బాదర్ల మల్లీ, బాసు శివప్రసాద్‌ ,పెద్ది వెంకట్‌, శ్రీనివాసరావు, బాదర్ల లో లక్ష నాయుడు, పూషడప్ప బాను, గోపి తో, పాటు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
y