Sep 20,2021 00:07

తాడేపల్లిలో మాట్లాడుతున్న సిహెచ్‌ బాబురావు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లావిలేకర్లు : వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేలా తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం 27న భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాడేపల్లి ఉండవల్లి సెంటర్‌లో ఎస్‌కె.పీరుసాహెబ్‌ అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. బాబురావు మాట్లాడుతూ మతోన్మాద ఎజెండాతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి, విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి ప్రజల్ని ఇక్కట్ల పాల్జేస్తోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఓడిస్తే అంత మంచిదన్నారు. సమావేశంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి నాయకులు ఈమని రామారావు, వి.వెంకటేశ్వరరావు, సుందర రావు, కె.వెంకటేశ్వర్లు, ఎ.ప్రకాశరావు, జి.కృష్ణ, కె.ఆంజనే యులు, జి.నాగేశ్వరరావు, పాల్గొన్నారు. పట్టణంలోని మహానాడు, రామయ్య కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో సమావేశాలు, కరపత్రాలు పంపిణీ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, వి.దుర్గారావు, బాజి, కె.కరుణాకరరావు, బాషా, మల్లేశ్వరి పాల్గొన్నారు. మెల్లంపూడిలో సిపిఎం విస్తృత సమావే శంలో రూరల్‌ నాయకులు పి.కృష్ణ మాట్లాడారు. కె.సాంబశివరావు, కె.జేమ్స్‌, నాయక్‌, కె.మరియమ్మ, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. రేపల్లెలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఎవిపికె సుబ్రహ్మణ్య అధ్యక్షత వహించారు. సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ దేశ ఆస్తులను పెట్టుబడిదార్లకు కట్టబెట్టడానికి కేంద్రం పూనుకుందని విమర్శించారు. ప్రజలపై భారాలేస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రం లోని పార్టీలన్నీ బంద్‌లో కలిసి రావాలని కోరారు. సిపిఎం డివిజన్‌ కార్య దర్శి సీహెచ్‌.మణిలాల్‌, నాయ కులు కె.శరత్‌బాబు, జి.దానియేలు, వి.బిక్షా లు, కెవి.లక్ష్మణరావు పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన సదస్సు కు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చుక్క చంద్రపాల్‌ అధ్యక్షత వహించగా కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడారు.బంద్‌ జయప్రద తీర్మానాన్ని న్యాయవాది ఖాజావలి ప్రవేశపెట్టగా, కార్యాచరణ ప్రణాళికను కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు డి.జ్ఞాన్‌రాజ ్‌పాల్‌ ప్రవేశపెట్టారు. ఎం.వేదాద్రి, సిపిఎం పశ్చిమ గుంటూరు జిల్లా, పట్టణ కార్యదర్శులు కార్యదర్శి గద్దె చలమయ్య, డి.విమల, సిఐటియు పశ్చిమ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజరుకుమార్‌, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్‌, న్యాయవాది ఖాజావలి, బి.కిషోర్‌బాబు, జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. మేడికొండూరులో బంద్‌ పోస్టర్‌ను ప్రజా సంఘాలు ఆవిష్కరణ, సభ నిర్వహించారు. వై.రాధాకృష్ణ, బి.రామకృష్ణ మాట్లాడారు. పెదనందిపాడు, నాగులపాడు, వరగాని గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. సిఐటియు తూర్పు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేశ్వరరావు మాట్లాడారు. వినుకొండలోని సిపిఎం కార్యాలయం, మండల కేంద్రమైన నూజెండ్లలో బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.హనుమంతరెడ్డి మాట్లాడారు.