Mar 02,2021 22:43

ప్రజాశక్తి-కందుకూరు: కందుకూరు టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్న 25 మంది విద్యార్థులు ఎన్‌సిసికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ ఎం.రవికుమార్‌ తెలిపారు. కళాశాలలో సీనియర్‌ డివిజన్‌ ఆర్మీ వింగ్‌ ఎన్‌సిసి క్యాడెట్‌ల ఎంపిక మంగళవారం జరిగింది. వంద మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. రన్నింగ్‌, ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు నిర్వహించి 25 మందిని ఎంపిక చేసినట్లు ఎన్‌సిసి కేర్‌ టేకర్‌ తెలిపారు.