Jun 10,2021 17:15

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, మిలిండా దంపతులు వారి వివాహ బంధాన్ని ఇక కొనసాగించలేమని.. విడాకులు తీసుకుంటున్నామని చెప్పి ప్రపంచానికి షాక్‌నిచ్చారు. ఇటీవల వీరు విడుకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక బిల్‌గేట్స్‌ దంపతులు ట్విటర్‌లో విడాకుల గురించి ప్రకటించినప్పటి నుంచీ.. కొంతమంది నెటిజన్లు వీరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుకున్నారు? వీరిపేరిట ఎంత ఆస్థి ఉంది? వారి అభిరుచులేంటి.. వారిలో ఎవరికైనా వివాహమైందా? వంటి వాటిపై సెర్చ్‌ చేయడం మొదలుపెట్టారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి.

jennifer


బిల్‌గేట్స్‌, మిలిండా దంపతుల పెద్ద కుమార్తె జెన్నీఫర్‌ గేట్స్‌ (25). ఆమె పేరిట ఏకంగా 25 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయట. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు లక్షా 82 వేల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో నికర ఆస్తులు అంటే ఆషామాషీ విషయం కాదని.. కొందరు నోరెళ్లబెడుతున్నారు. అంటే ఆ స్థాయిలో ఆస్తులంటే.. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకో.. లేక సెలబ్రిటీలకో అరుదుగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. తన తండ్రి ఆస్తి విలువ ఏకంగా 130 బిలియన్‌ డాలర్లుంటే.. వారసత్వంగా అంత పెద్ద మొత్తంలోనే ఆస్తి వస్తుందని మరికొందరి అభిప్రాయం. ఇక జెన్నీఫర్‌ చదువు విషయానికొస్తే.. ఆమె సియాటెల్‌లోని లేక్‌సైడ్‌ హైస్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మావన జీవశాస్త్రం (హ్యూమన్‌ బయాలజీ) సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. ఆమెకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమట. తాను ఆరేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ చేస్తూనే ఉన్నారు. ఆమె ఫేవరెట్‌ గుర్రం పేరు అలెక్స్‌. తాను త్వరలో నాయల్‌ నాజర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోకున్నారు. నాయల్‌ నాజర్‌, జెన్నీఫర్‌ వీరిద్దరూ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. అంతేకాక నాజర్‌ ఈజిప్టుకు చెందిన మరో ఇక్వస్టియన్‌, షో జంపర్‌. షో జంపింగ్‌ అనేది ఒక ఒలింపిక్‌ క్రీడ. గుర్రాలు హర్డిల్‌ జంప్‌ చేసే బృంద క్రీడ ఇది. ప్రొఫెషనల్‌ షో జంపర్‌ అయిన నాజర్‌ గురించి ఆ రంగంపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు... జెన్నీఫర్‌తో నిశ్చితార్థమైన తర్వాత అతను ప్రపంచ సెలబ్రిటీ అయ్యారంటే ఆశ్చర్యం లేదు. ఇక వీరి ప్రేమ గురించి తెలుసుకోవాలంటే జెన్నీఫర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న ఫొటోలను చూస్తే తెలిసిపోతుంది. ఇక జెన్నీఫర్‌కు గుర్రపు స్వారీ మాత్రమే కాదండోరు.. టూర్‌లు ఎంజారు చేయడమూ ఇష్టమేనట. ఇప్పటికే ఆమె కువైట్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలెన్నింటినో చూసిందట.
తల్లిదండ్రుల విడాకుల ప్రకటనపై జెన్నీఫర్‌ స్పందిస్తూ.. 'ఈ సమయంలో నాతోపాటు నా కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి, వారి భావోద్వేగాలకు ఎలా అండగా నిలబడాలో ఇంకా నేర్చుకుంటున్నా' అని ట్వీట్‌ చేశారు. ఎవరికైనా సాయం చేయడంలో తన తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నారని ఆమె చెబుతుంది.

jennifer 3