Nov 21,2020 21:52

వాషింగ్టన్‌ : గత 24గంటల్లో అమెరికావ్యాప్తంగా 2,015మంది మరణించారని శుక్రవారం ట్రంప్‌ ప్రభుత్వం తెలిపింది. మే తర్వాత అమెరికాలో ఒకే రోజు ఇంత ఎక్కువగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గత 24గంటల్లో 1,87,833 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ప్రభావం అంతగా లేని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడుకరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఈ కేసులు ఇలానే పెరుగుతూ వుంటాయని, జనవరి మధ్య నాటికి రోజు వారీ కరోనా మృతుల సంఖ్య 2500కి పైగానే వుండొచ్చని వాషింగ్టన్‌ యూనివర్శిటీకి చెందిన సంస్థ హెచ్చరించింది. అమెరికాలో ఇప్పటివరకు ఈ వైరస్‌తో మరణించేవారి సంఖ్య 2,50,000 దాటగా కోటీ 17లక్షల మందికి పైగానే కరోనా సోకింది.