Sep 24,2021 01:52

మొక్క నాటి నీళ్లు పోస్తున్న వీసెజ్‌ డిసి రామ్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
'ఆజాది 75 ప్లూ మేరియా గార్డెన'్‌ పేరుతో ప్రారంభించిన పార్కులో మామిడి, జామ, ప్లూమేరియా మొక్కలు వీసెజ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌రెడ్డి గురువారం నాటారు. డిసి పిలుపుతో వీసెజ్‌ పరిధిలోని 62 సెజ్‌లోని 569 యూనిట్లలో యాజమాన్య ప్రతినిధులు మొక్కలు నాటారు. 2021 మార్చి 12 నుంచి 2022 ఆగస్టు 15 మధ్య కాలంలో వీసెజ్‌ పరిధిలోని సెజ్‌లో సుమారు 1.9 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సుమారు 86వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడిసి కిరణ్‌బాబు, డిడిసి ఫణి, కస్టమ్స్‌ అధికారి ప్రసాదవర్మ, ఎడిసిలు, వీసెజ్‌ సిబ్బంది, యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.