Dec 05,2021 18:26

సమావేశంలో మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్‌ భాష

19న డివైఎఫ్‌ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయండి
ప్రజాశక్తి - ఆత్మకూరు

నంద్యాల పట్టణంలో ఈ నెల 19న జరిగే డివైఏఫ్‌ఐ జిల్లా మహాసభలకు జిల్లాలోని యువతీ, యువకులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి డి.హుస్సేన్‌ భాష, జిల్లా అధ్యక్షులు డి.రామ్‌ నాయక్‌లు కోరారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో డివైఎఫ్‌ఐ పట్టణ కన్వీనింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1980లో పంజాబ్‌లోని లుధియానాలో డివైఎఫ్‌ఐ ఏర్పడిందని, అప్పటినుండి నేటి వరకు నిరుద్యోగ, యువతీ యువకుల సమస్యలపైన నిత్యం పోరాటాలు చేస్తుందన్నారు. అలాగే సేవా గుణంతో ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తూ నట్టేట ముంచిందన్నారు. నిరుద్యోగ, యువత సమస్యలపై భవిష్యత్తులో ఏ ఏ పోరాటాలు చేయాలనే అంశాలపై మహాసభలలో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు నిరుద్యోగులు, యువతీ, యువకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. డివైఎఫ్‌ఐ నాయకులు రోషన్‌, కలిముల్లా, గోవిందు, సిలార్‌, అతావుల్లా, హబివుల్లా, జావిద్‌, షాహిన్‌షా, జబివుల్లా, సలీం, ఫరూక్‌ తదితరులు పాల్గొన్నారు.