Nov 20,2020 21:20

న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల విరామం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల సవరణతో పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.06 నుంచి రూ.81.23కు చేరింది. రూ.70.46గా ఉన్న డీజిల్‌ ధర రూ.70.86కు పాకింది. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి పెట్రోల్‌ ధరల్లో సవరణ చేయడం ఇది తొలిసారి కావడం గమనార్హం. అక్టోబర్‌ 2 నుంచి డీజిల్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా భారతీయ ఆయిల్‌ కంపెనీలు రోజువారీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు చేసే విధానాన్ని తీసుకువచ్చారు. కరోనా నేపథ్యంలో కంపెనీలు పలుమార్లు కొన్ని రోజుల పాటు ధరల విషయంలో స్టాటస్‌కో (ధరల్లో మార్పు చేయకుండా)ను అవలంభించాయి.