Apr 15,2021 01:05

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యువజన, విద్యార్థి సంఘాల నాయకులు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యాన యూత్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ఆయా సంఘాల నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయటం దుర్మార్గమన్నారు. దీనిపై అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలకు మద్దతుగా యూత్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు మార్చ్‌ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాలు డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, పిడిఎస్‌ఓఎలు పాల్గొంటాయన్నారు. పోస్టర్‌ ఆవిష్కరణలో డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి యుఎస్‌ఎన్‌ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎల్‌జె నాయుడు, ఎఐఎస్‌ఎఫ్‌ నగర కార్యదర్శి ఫణీంద్ర, పిడిఎస్‌ఒ జిల్లా కార్యదర్శి ఎస్‌.అశోక్‌ పాల్గొన్నారు.