
విజయవాడ : విజయవాడ ఇండ్రకీలాద్రిపై ఉన్న దుర్గ గుడిలోని 16 మంది ఉద్యోగులపై ఎపి దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది. వారిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దుర్గ గుడిలో ఎసిబి అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, టిక్కెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. దీంతో సంబంధిత విభాగాలైన అన్నదానం, స్టోర్స్, హౌస్ కీపింగ్ విభాగం, గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలను పర్యవేక్షించే విభాగం, ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను పర్యవేక్షించే సూపరింటెండెంట్లతో పాటు దర్శన టిక్కెట్ల అమ్మకంలో పనిచేసే ముగ్గురు, ప్రసాదాల పంపిణీ, అమ్మవారి చీరలు, ఫొటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బందిని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన 18 మందిలో కొద్దిమంది సిబ్బంది పేర్లు..
1. కె.శ్రీనివాసరావు - ప్రసాదం తయారీ, చీరల విభాగం సూపరింటెండెంట్
2. కె.శ్రీనివాసమూర్తి - అన్నదానం విభాగం
3. ఎ.అమృతరావు - మెయిన్స్టోర్ సూపరింటెండెంట్
4. కె.హరికృష్ణ - మెయిన్స్టోర్ సూపరింటెండెంట్
5. పి. భాగ్యజ్యోతి - శానిటేషన్, సూపరింటెండెంట్
6. కూరెళ్ల శ్రీనివాసరావు - లీజుల విభాగం సూపరింటెండెంట్
7. జి.యశ్వంత్ - సీనియర్ అసిస్టెంట్, లీజుల విభాగం
8. బి.నాగేశ్వరరావు - సీనియర్ అసిస్టెంట్, చీరల విభాగం
9. సిహెచ్. చెన్నకేశవరావు - జూనియర్ అసిస్టెంట్, చీరల విభాగం
10.ఎం.ఎస్.ప్రకాశరావు - జూనియర్ అసిస్టెంట్, శానిటేషన్ విభాగం
11. పి.రవికుమార్ - దర్శనం టిక్కెట్ల రికార్డు అసిస్టెంట్
12. కె.రమేష్ - ఆర్జిత సేవల రికార్డు అసిస్టెంట్
13. పి.రాంబాబు - ఫొటో కౌంటర్ రికార్డు అసిస్టెంట్
14.జె.ఏడుకొండలు - అటెండర్, ప్రసాదం టికెట్లు
15.రవిప్రసాద్ - సూపరింటెండెంట్
16.పద్మావతి - సీనియర్ అసిస్టెంట్