Nov 29,2021 21:05
  • ముప్పు జాబితాలో పలు దేశాలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌లో తాజాగా కనుగొను నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. సోమవారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో ఈ వేరియంట్‌ ఉనికి బయటపడింది. డెల్టా రకం కనాు ఇది ఆరు రెట్లు ఎక్కువ వ్యాగంతో వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్‌తో ఇప్పటిదాకా ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్య్లుహెచ్‌ఓ) ప్రకటించింది. అయితే, వైరస్‌ వ్యాప్తి చెందుతును తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీనికి ప్రమాదకర జాబితాలో చేర్చింది. మరోవైపు ఈ వేరియంట్‌ తొలుత బయటపడ్డ దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్యరంగ నిపుణులు ఇది సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, ఎవరిని ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం కూడా రాలేదని చెబుతున్నారు. కొందరిలో స్వల్ప లక్షణాలు కూడా కనిపించలేదని అంటున్నారు. డబ్ల్యుహెచ్‌ఓ మాత్రం నూతన వేరియంట్‌ ప్రభావం పూర్తిగా అర్ధంకావడానికి మరికొద్ది రోజులు పడుతుందని, అప్పటివరకు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్కంలో భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్‌ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో పలు దేశాలను 'ముప్పు' దేశాలుగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్సువానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుండి వచ్చే వారికి విమానాశ్రయాల్లోనే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ఫలితం వచ్చేంత వరకు పర్యటనలకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించింది.
 

విమానాశ్రయాలలో స్క్రీనింగ్‌ పరీక్షలు : సిఎం జగన్‌ ఆదేశం
ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులలో ప్రత్యేకంగా మెడికల్‌ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, డిసెంబరు నెలాఖరుకు రెండుకోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వాలని చెప్పారు. . ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌, ఫీవర్‌ సర్వే చేయాలన్నారు. రాష్ట్రంలో మాస్క్‌ వినియోగం తగ్గిందని, దీనికోసం మళ్లీ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రులలో ఆక్సిజన్‌ నిల్వలు, డాక్టర్ల అందబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

దేశాల వారీగా...
దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాలోని పలు ప్రావిన్స్‌ల్లో 1,100 మందిపై పరీక్షలు నిర్వహించగా.. 90 శాతం మంది ఈ కొత్త వైరస్‌ బారిన పడ్డారు.
బోత్సువానా : ఈ దేశంలో 19 కేసులు వెలుగుచూశాయి.
బ్రిటన్‌ : మూడు కేసులు బయటపడగా.. ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వారి వల్ల సోకినవే.
జర్మనీ : రెండు కేసులు... దక్షిణాఫ్రికా నుండి మునిచ్‌ వచ్చిన వారిలో గుర్తించారు.
నెదర్లాండ్‌ : 13 కేసులను గుర్తించారు.
డెన్మార్క్‌ : రెండు కేసులు
బెల్జియం : ఒక కేసు
ఇజ్రాయిల్‌ : ఒకటి నిర్ధారణైంది. మరొకరి సోకినట్లు అనుమానిస్తున్నారు.
ఇటలీ : ఒకటి.. అయితే పాజిటివ్‌ నిర్ధారణ కావడానికి ముందు దేశాన్ని చుట్టివచ్చినట్లు తెలుస్తోంది.
చెక్‌ రిపబ్లిక్‌ : ఒకటని స్థానిక మీడియా చెబుతోంది
హాంగ్‌కాంగ్‌ సర్‌ : క్వారెంటైన్‌ హోటల్‌లో రెండు కేసులు వెలుగు చూశాయి.
ఆస్ట్రేలియా : సౌత్‌వేల్‌ స్టేట్‌లో రెండు కేసులు బయటపడ్డాయి.
కెనడా : నైజీరియా నుండి వచ్చిన వారిలో ఇద్దరికి వైరస్‌ సోకింది.