Oct 27,2021 23:52

నిందితురాలు, పట్టుకున్న సారాతో పోలీసులు

ప్రజాశక్తి -కంచిలి: మండలంలోని ఎస్‌ఆర్‌సిపురం, పురుషోత్తపురం గ్రామాల మధ్య మంగళవారం రాత్రి 1200 నాటుసారా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఆరు సిమెంట్‌ గోనె సంచుల్లో నాటుసారాను ఎస్‌ఆర్‌సిపురంకి చెందిన జి.మంగమ్మ, కె.పాపయ్య తరలిస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. మంగమ్మను పట్టుకోగా నిందితుడు పాపయ్య తప్పించుకున్నట్లు చెప్పారు. ఈ దాడిలో స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.